ట్రంప్ మ్యాచ్‌తో ఆసక్తి పీబీఎల్‌పై గోపీచంద్ | Trump matches will add to excitement in PBL: Pullela Gopichand | Sakshi
Sakshi News home page

ట్రంప్ మ్యాచ్‌తో ఆసక్తి పీబీఎల్‌పై గోపీచంద్

Published Thu, Dec 31 2015 2:54 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

Trump matches will add to excitement in PBL: Pullela Gopichand

 ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టనున్న ట్రంప్ మ్యాచ్‌ల వల్ల మరింత ఉత్సాహం వస్తుందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘లీగ్‌కు ఇదో అదనపు ఆకర్షణ. ఈ మ్యాచ్‌ల వల్ల ఉత్సాహం పొంగిపొర్లుతుంది. ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా ప్రతిపాదిస్తుంది. కేవలం అర్ధగంట ముందు దీనికి సంబంధించిన లైనప్‌ను ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి అదనపు పాయింట్ లభిస్తే, ఓడిన వారికి ఓ పాయింట్ కోత పడుతుంది. రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్‌గా ప్రకటించొచ్చు. 3-0 ఆధిక్యం ఉన్నా చివరి రెండు మ్యాచ్‌లు కచ్చితంగా ఆడాల్సిందే. కాబట్టి అభిమానుల ఆసక్తిని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గోపీచంద్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement