సైనాకు అవార్డు
గుర్గావ్: ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. అలాగే యువ ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేశారు.
యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా... అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లి నిలిచారు. క్రికెట్‌కు తమ సేవలను అందించినందుకు గత ఏడాది రిటైర్ అయిన రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించారు. మిగతా అవార్డులు దక్కిన వారిలో ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకున్న అండర్-19 భారత క్రికెట్ జట్టు, రెజ్లర్ సుశీల్ కుమార్, పారాలింపిక్ అథ్లెట్ హెచ్‌ఎన్ గిరీశ, స్వరణ్ సింగ్ (రోయింగ్), ఉత్తమ్ రాయ్ (ఫుట్‌బాల్) ఉన్నారు.