coach of the year
-
కుంబ్లేకు 'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
బెంగళూరు: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే 'కోచ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. సోమవారం స్పోర్ట్స్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు(స్వాబ్) ప్రకటించిన అవార్డుల్లో కుంబ్లేకు కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. 2016, జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు కుంబ్లే పర్యవేక్షణలోని భారత్ జట్టు వరుసగా ఐదు టెస్టు సిరీస్‌ల్లో ఘన విజయాలు సాధించడంతో ఈ అవార్డును అతనికి అందజేస్తున్నట్లు స్వాబ్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నగరంలోని తాజ్ వివంతాలో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో భారత మహిళా హాకీ జట్టు కోచ్ హరేందర్ సింగ్ చేతుల మీదుగా అనిల్ కుంబ్లే అవార్డును అందుకున్నారు. అవార్డు స్వీకరణ అనంతరం కుంబ్లే మాట్లాడుతూ.. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 'కర్ణాటక రాష్ట్రంలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో స్వాబ్ ఎప్పుడూ ముందుంటుంది. మీ సహకారం లేకపోతే.. నా క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే అవార్డులను దక్కించుకునేవాడిని కాదేమో. ఇప్పుడు నా ముందు కూర్చున్న చాలా మంది స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు నాకు సుదీర్ఘకాలంగా తెలుసు. నా స్కూల్ క్రికెట్ నుంచి నా కెరీర్ రిటైర్మెంట్.. తర్వాత కోచ్ బాధ్యతలు ఇలా అన్ని సమయాల్లోనూ వారు నా గురించి వార్తలు రాశారు. ఈ మీ ప్రోత్సాహం మరువులేనిది.. ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని కుంబ్లే పేర్కొన్నాడు. అవార్డుల విజేతల పేర్ల జాబితా.. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(పురుషులు): సునీల్ చెత్రి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(మహిళలు):అదితి అశోక్ టీమ్ ఆఫ్ ద ఇయర్: బెంగళూరు ఎఫ్‌సీ కోచ్ ఆఫ్ ద ఇయర్: అనిల్ కుంబ్లే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: ఎమ్పీ గణేశ్ బెస్ట్ జూనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(పురుషులు): అర్జున్ మైనీ బెస్ట్ జూనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(మహిళలు): దామిని గౌడ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్: కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్ -
సైనాకు అవార్డు
గుర్గావ్: ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. అలాగే యువ ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేశారు. యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా... అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లి నిలిచారు. క్రికెట్‌కు తమ సేవలను అందించినందుకు గత ఏడాది రిటైర్ అయిన రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించారు. మిగతా అవార్డులు దక్కిన వారిలో ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకున్న అండర్-19 భారత క్రికెట్ జట్టు, రెజ్లర్ సుశీల్ కుమార్, పారాలింపిక్ అథ్లెట్ హెచ్ఎన్ గిరీశ, స్వరణ్ సింగ్ (రోయింగ్), ఉత్తమ్ రాయ్ (ఫుట్‌బాల్) ఉన్నారు.