
ఫైనల్లో సింధు ఆశించినట్లుగా ఆడలేకపోయింది. చాలా ఒత్తిడికి లోనైంది. ఎక్కువ సంఖ్యలో పొరపాట్లు చేసింది. నిజానికి ఈ ఫైనల్లో ఆమెకు ఏదీ కలిసి రాలేదు. టైటిల్ పోరుకు గత మ్యాచ్‌కు మధ్య విరామం కూడా తక్కువే. ఇటీవల కాలంలో ఆమెకు ఎదురైన ఫైనల్స్ పరాజయాల్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు.
ఎందుకంటే వరుసగా రెండు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఫైనల్ చేరడం ఆషామాషీ కాదు. స్వర్ణం చేజారినా... ఓవరాల్‌గా సింధు ప్రదర్శన బాగుంది. తర్వాత జరిగే టోర్నీల్లో మెరుగైన నియంత్రణ, ఆటపై పట్టు సాధించే అంశాలపై మేం దృష్టి సారిస్తాం.
– చీఫ్ కోచ్ గోపీచంద్
Comments
Please login to add a commentAdd a comment