
ఒడిశా: భారత బ్యాడ్మింటన్‌కు ముఖచిత్రంగా మారిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) ఒడిశా రాష్ట్రంలో తన సేవల్ని విస్తరించనుంది. ఈ మేరకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (పీబీఎంఎఫ్)తో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఒడిశా క్రీడా, యువజన శాఖ మంత్రిత్వశాఖ శుక్రవారం ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒడిశాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి పీజీఎంఎఫ్ సహకరించనుంది. అక్కడి అకాడమీల్లో శిక్షణ పొందే వర్ధమాన క్రీడాకారులకు కోచింగ్‌తో పాటు సాంకేతికంగా సహకరించనుంది.
గోపీచంద్ పర్యవేక్షణలో శిక్షణా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ పీజీఎంఎఫ్ సహకారంతో ఒడిశాలో బ్యాడ్మింటన్ త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో తమ క్రీడాకారులు భారత్‌కు పతకాలు అందించే రోజు త్వరలోనే రానుందన్నారు. ఒడిశా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామన్న గోపీచంద్ ఒడిశా నుంచి ప్రపంచ స్థాయి షట్లర్లను తయారుచేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment