గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ సి.తంగరాజ్ తెలిపారు.
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ సి.తంగరాజ్ తెలిపారు. స్నాతకోత్సవానికి డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.క్రిస్టోఫర్ ముఖ్య అతిథిగా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విశిష్ట అతిథులుగా హాజరవుతారని చెప్పారు.
ఈ సందర్భంగా తమ యూనివర్సిటీ తరఫున గోపీచంద్, చాగంటి కోటేశ్వరరావులకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 16లోపు ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా తమ డిగ్రీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.