లండన్ వీధుల్లో భారత ఆటగాళ్లు..
Published Wed, Jun 7 2017 5:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
లండన్: ప్రాక్టీస్ వ్యూహాలకు వర్షం దెబ్బకొట్టడంతో భారత క్రికెటర్లు మంగళవారం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. జట్టు సభ్యులంతా కలిసి లంచ్, డిన్నర్ చేస్తూ గడిపారు. బర్త్ డే బాయ్ అజింక్యా రహానే మాత్రం తన భార్య రాధికతో ప్రయివేట్‌గా లండన్ వీధులు తిరుగుతూ తన 29 వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఆల్ రౌండర్ జడేజా డిపార్ట్ మెంటల్ స్టోర్ లో సందడి చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించిన తర్వాత సోమవారం ఆటగాళ్లు సంతోషంగా కోహ్లీ చారిటీ డిన్నర్ కు హాజరైన విషం తెలిసిందే. మంగళవారం ఉదయం వర్షం కారణంగా హోటల్‌కే పరిమితమైన ఆటగాలళ్లు వర్షం వెలిసిన తర్వాత లండన్ వీధుల్లో షాపింగ్ చేస్తూ.. అభిమానులతో సెల్పీలు దిగారు.
ఇక ఆటగాళ్లే ఎంజాయ్ చేస్తున్నారనుకుంటే కోచ్ అనిల్ కుంబ్లే సైతం హోటల్ సమీపంలోని పార్క్‌కు తన భార్యతో జాగింగ్ వెళ్లాడు. వర్షంతో మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొనకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పాక్‌పై విజయంతో జోరుమీదున్న కోహ్లీ సేన శ్రీలంకను మాత్రం తక్కువ అంచనా వేయడం లేదు. గురువారం భారత్, శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని టీంఇండియా భావిస్తుంది. ఇక ఆదివారం గ్రూప్ బిలో భారత్‌కు వరల్డ్ నెం1 దక్షిణాఫ్రికాతో గట్టి పోటి ఎదురవ్వనుంది.
Advertisement
Advertisement