ప్రపంచ కప్ వుషులో భారత్‌కు 5 పతకాలు | 5 medals in Wushu World Cup to India | Sakshi
Sakshi News home page

ప్రపంచ కప్ వుషులో భారత్‌కు 5 పతకాలు

Published Tue, Nov 8 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

5 medals in Wushu World Cup to India

న్యూఢిల్లీ: సాండా ప్రపంచ కప్ వుషు పోటీల్లో భారత క్రీడాకారులు ఆకట్టుకున్నారు. చైనాలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఐదు పతకాలు లభించారుు. ఈ టోర్నీలో భారత్ నుంచి పాల్గొన్న ఐదుగురూ పతకాలు తేవడం విశేషం. ‘అర్జున అవార్డీ’ వై. సనతోరుు దేవి 52 కేజీల విభాగం ఫైనల్లో లువాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోరుు రజతాన్ని దక్కించుకుంది.

సనతోరుుతోపాటు మోనిక (56 కేజీలు) కూడా రజతం నెగ్గగా... పూజా కడియాన్ (75 కేజీలు) కాంస్యం సాధించింది. పురుషుల విభాగంలో ఉచిత్ శర్మ (52 కేజీలు), సూర్య భాను ప్రతాప్ సింగ్ (60 కేజీలు) రజత పతకాలు గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement