నవంబర్ 28, 2012ను న్యూయార్‌కలో అత్యంత సురక్షితమైన, ప్రశాంతమైన దినంగా ఆ నగర మేయర్ ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఒక్క దొంగతనం కానీ, అత్యాచారం కానీ, హత్య కానీ జరగలేదట!
నవంబర్ 28, 2012ను న్యూయార్‌కలో అత్యంత సురక్షితమైన, ప్రశాంతమైన దినంగా ఆ నగర మేయర్ ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఒక్క దొంగతనం కానీ, అత్యాచారం కానీ, హత్య కానీ జరగలేదట!
ఫిన్‌లాండ్‌లో యేటా జూలై 27న ‘నేషనల్ స్లీపీ హెడ్ డే’ అనే వేడుక జరుగుతుంది. కుటుంబంలో అందరికంటే చిన్నవాళ్లని కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సరస్సులోకి విసిరేస్తారు. ఇంట్లో చిన్నవాళ్లు సాధారణంగా బద్ధకస్తులై ఉంటారు, ఆ బద్ధకాన్ని వదిలించడానికే అలా చేస్తున్నామని అంటారు వాళ్లు. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో ఒక బద్ధకస్తుడిని అలా చేశారట. అప్పట్నుంచీ ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు!
మనసు, శరీరం రిలాక్స్‌డ్‌గా ఉండాలని చాలామంది ‘స్పా’లకు వెళ్తుంటారు. అయితే ఏనుగులకు కూడా ఓ స్పా ఉందన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఎక్కడో కాదు... మన దేశంలోనే. కేరళలోని పున్నత్తూర్‌కొట్టలో ఉన్న ‘ఎలిఫెంట్ రెజువనేషన్ సెంటర్’లో ఏనుగులకు క్రమం తప్పకుండా మసాజులు చేస్తుంటారు!
ప్యూర్టోరికోలో ఒక ఐల్యాండ్ ఉంది. దీనిలో మనుషులెవరూ ఉండరు. కేవలం కోతులే ఉంటాయి. దాదాపు ఎనిమిది వందలకు పైగా కోతులు నివసించే ఆ దీవిని ‘మంకీ ఐల్యాండ్’ అంటారు!
సియాటెల్‌లో ప్రపంచంలోనే ఓ పెద్ద పార్క్‌ను రూపొందిస్తున్నారు. ఈ అతి పెద్ద పార్క్‌లో వేలకొద్దీ పండ్ల చెట్లు, కూరగాయ మొక్కలు నాటుతారట. దీనికి ఎంట్రీ ఉచితం. అలాగే ఎవరికి ఎన్ని పండ్లు, కూరగాయలు కావాలన్నా ఉచితంగా తీసుకునే ఏర్పాటు చేయనుంది
ఆ ప్రభుత్వం!
పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్లి, నీళ్లు సరిగ్గా పోయకపోవడం సింగపూర్లో నేరం. దానికి నూట యాభై డాలర్ల వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో ఉన్న ఫ్యుగేరీ... ప్రపంచంలోనే అత్యంత పురాతన హౌసింగ్ కాంప్లెక్స్. 1516లో నిర్మించిన ఇక్కడి ఇళ్లలో ఇప్పటికీ ఎంతోమంది నివసిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే... అద్దె అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే. కేవలం 0.88 యూరోలు!