
లండన్: ప్రస్తుతం ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైద్యరంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. తాజాగా ఫిన్‌లాండ్‌కి చెందిన శాస్త్రవేత్తలు హృదయ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే ఓ సరికొత్త వ్యవస్థను రూపొందించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె వ్యాధులను డాక్టర్ల కంటే కచ్చితంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
సుమారు 950 మంది రోగులపై ఏకంగా ఆరేళ్లపాటు పరిశోధన జరిపిన అనంతరం వైద్యులు ఈ టెక్నాలజీ పనితీరు పట్ల నిర్ధారణకు వచ్చారు. గుండె కొట్టుకునే తీరు, వేగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేస్తూ... భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల రోగికి ముందుగానే సరైన చికిత్స అందించడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment