అలవాటు.. ఆచారం.. వ్యవహారం.. ఏదైనా సరే పాటిస్తున్నవారికి సర్వసాధారణమనిపిస్తుంది. ఆ పట్టింపులు.. పాటింపుల్లేని వారికి మాత్రం వింతగా కనిపిస్తుంది. కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. కాలక్షేపాన్నిస్తుంది. అలాంటి సంగతులు కొన్ని..
ఎండల్లో పడక
ఫిన్‌లాండ్‌లో ఏ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. గబగబా చంటి పిల్లలను స్ట్రాలర్స్‌లో వేసి తీసుకెళ్లి ఇంటి ముందు వాకిళ్లలో, వాకిళ్లు లేని వాళ్లు పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసి వాళ్లు ఇళ్లకు వెళ్లిపోతారు. అలా వెచ్చటి ఎండకు ఆ పిల్లలు గంటలు గంటలు ఆదమరచి నిద్రపోతారు.
ఇదో ఆచారంగా కొనసాగుతోందట ఆ దేశంలో. కొందరు మోడర్న్ తల్లులు ఇప్పుడు పిల్లలను అలా ఆరుబయట వదిలిపెడుతున్నప్పుడు వాళ్లను చూసుకోవడానికి ఆయాలను పెడుతున్నారట కానీ ఇదివరకైతే పిల్లల దగ్గర ఎవరూ ఉండేవారు కాదట మరి. అలా వదిలేయడమే ఆచారమట.
మనసు పవిత్రమవుతుందని..
.. ఎక్కడ? స్పెయిన్‌లో. ఏం చేస్తే? చంటి పిల్లల మీద నుంచి దూకితే.. చంటి పిల్లల ఆత్మ పరిశుద్ధమవుతుందట. ఎవరు దూకుతారు? అలా దూకడానికి ప్రత్యేక వ్యక్తులు ఉంటారట. వాళ్లు పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న దుస్తులను వేసుకుని ఆరుబయట పడుకోబెట్టిన పిల్లల మీద నుంచి లాంగ్ జంప్ చేస్తారు. అలా చేయడం వల్ల పిల్లలను పట్టుకున్న దుష్టశక్తులు వదిలిపోతాయని.. పిల్లలు పవిత్రమైపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అక్కడి జనాల నమ్మకమట.
చదవండి: Aaron Sanderson King Of Piel Island: రాజయోగం.. ఎలక్ట్రీషియన్ వృత్తి నుంచి ఓ దీవికి రాజుగా..!
Comments
Please login to add a commentAdd a comment