హెల్సింకి: ఆడపిల్ల అంటే చాలు సుద్దులు, బుద్ధులు నేర్పడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది సమాజం. ఈ విషయంలో సాధారణ మహిళ, సెలబ్రిటీ అనే తేడా ఏం ఉండదు. ఆఖరికి ఆమె ప్రధాని పీఠం అధిరోహించినా సరే.. హద్దులు నేర్పిస్తుంటారు. ఆడవారు వేసుకునే బట్టలు, ఉండే తీరు అన్నింటికి ఓ కొలతలు గీసి పెడతారు. అవి ఏ మాత్రం తగ్గినా ఇక దాడి మొదలు పెడతారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్‌కి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫోటోపై నెటిజనులు అభ్యంతరకర కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. ప్రధానివా.. మోడల్‌వా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో చాలా మంది ఆడవారు ప్రధానికి మద్దతుగా నిలవడమే కాక ఈ ట్రోల్స్‌ని తిప్పికొట్టారు. వారు కూడా అలాంటి దుస్తులే ధరించి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంతలా విమర్శలు ఎదుర్కొంటుంది అంటే ఆమె మరి ఏ రేంజ్‌లో దుస్తులు ధరించిందో అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఆమె బ్లేజర్ ధరించారు.. కాకపోతే దాని నెక్ కాస్త డీప్‌కట్ ఉంది. దాంతో ఈ దుమారం. (చదవండి: ఆమె ఓ సేల్స్‌గర్ల్; క్షమించండి!)
వివరాల్లోకి వెళితే... 34 ఏళ్ల ఎంఎస్ మారిన్ ఈ నెల ప్రారంభంలో ఫ్యాషన్ మ్యాగజైన్ ట్రెండికి పోజులిచ్చారు. కవర్ ఫోటోషూట్ కోసం, ఆమె లో కట్ నెక్‌లైన్ ఉన్న బ్లాక్ బ్లేజర్‌ను ధరించారు. ఈ ఫోటోని ట్రెండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో దుమారం రేగింది. దాంతో ఇంటర్నెట్‌లోని ఓ విభాగం ‘ప్రధాని లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా చేయడం తగదు.. మీరు ప్రధానా లేక మోడలా.. మీ విశ్వసనీయత క్షీణించింది’ అంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ చాలా మంది మహిళలలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. ఇలా వ్యాఖ్యానించడం తగదన్నారు. బట్టలు కాదు ఆమె సాధించిన విజయాలు చూడాలని సూచించారు. అంతేకాక ప్రధానమంత్రికి మద్దతుగా వందలాది మంది మహిళలు లోనెక్ బ్లేజర్ ధరించిన ఫోటోలను ట్విట్టర్, సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ డెమొక్రాట్ అయిన సన్నా మారిన్ 2019 డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు, దేశ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రధానిగా నిలిచారు. ఆమె ఐదు పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.
#supportsanna #kalevalakoru @trendimag @MarinSanna pic.twitter.com/vdw5nDc1Z9
— Sari Viinikainen (@SariViinikainen) October 10, 2020
Comments
Please login to add a commentAdd a comment