షాప్‌లోనే తగలబడిన ఐప్యాడ్‌ బ్యాటరీ! | iPad battery catches fire in Finland | Sakshi
Sakshi News home page

షాప్‌లోనే తగలబడిన ఐప్యాడ్‌ బ్యాటరీ!

Published Thu, Sep 15 2016 9:31 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఫైల్ ఫోటో - Sakshi

ఫైల్ ఫోటో

ఏకంగా షాపింగ్‌ సెంటర్‌లోనే ఐప్యాడ్‌ బ్యాటరీ తగలబడటం ఫిన్‌లాండ్‌లో కలకలం రేపింది.

హెల్‌సింకీ: ఏకంగా షాపింగ్‌ సెంటర్‌లోనే ఐప్యాడ్‌ బ్యాటరీ తగలబడటం ఫిన్‌లాండ్‌లో కలకలం రేపింది. బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు అంటుకొని.. భారీగా పొగ ఎగజిమ్మడంతో షాప్‌లోని వినియోగదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు.

అధికారుల ప్రకారం.. రొవానీమిలోని ఓ ఫోన్ల దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఓ వినియోగదారుడు తన ఐప్యాడ్‌లోని బ్యాటరీ మార్చేందుకు దుకాణానికి వచ్చాడు. రెండేళ్ల కిందటి అతని ఐప్యాడ్‌లో బ్యాటరీ మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బ్యాటరీ నుంచి భారీగా పొగ ఎగజిమ్ముకుని షాప్‌లో అలుముకోవడంతో వినియోగదారులు బయటకు పరుగులు తీశారని జిన్హుహ వార్తాసంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement