
ఎలన్ మస్క్ ఎవరినీ వదలడు. తనకు ఏది తోస్తే అది.. ఎలా పడితే అలా..
Elon Musk Tweet On Finland PM: బిలియనీర్ ఆఫ్ ది ఎర్త్ ఎలన్ మస్క్ మరోసారి తన వెటకారం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా ఓ దేశ ప్రధానినే టార్గెట్ చేశాడు ఆయన. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్(36)ను ఉద్దేశిస్తూ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్‌ని ఉద్దేశిస్తూ.. మస్క్ చేసిన ట్వీట్ ఇదే.
— Elon Musk (@elonmusk) December 12, 2021
కారణం ఇదేనా?
ఫిన్లాండ్‌లో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో కొవిడ్ 19 నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సన్నా మారిన్ శనివారం ఓ నైట్‌క్లబ్ పార్టీకి వెళ్లారు. అయితే అంతకంటే ముందు ఫారిన్ మినిస్టర్ పెక్కా హవిస్టోతో భేటీ అయ్యారు. కాసేపటికే పెక్కాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో సన్నా.. తనకు తాను ఐసోలేట్ కాకుండా అలా పార్టీకి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
నిజానికి వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లు.. పాజిటివ్ పేషెంట్‌ను కలిసినా ఐసోలేషన్ రూల్ పాటించాలనే రూల్ ఏం లేదు. కానీ, ప్రజారోగ్యం దృష్ట్యా పబ్లిక్ ప్లేసుల్లోకి మాత్రం వెళ్లకూడదు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో.. సన్నా మారిన్ ఫేస్‌బుక్ సాక్షిగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఎలన్ మస్క్ ఆమెపై చేసిన ట్వీట్‌లో మాత్రం ఆంతర్యం బోధపడడం లేదు. ఆమెను పవర్‌ఫుల్ అని పొగుడుతున్నాడా?.. లేదంటే అధికారం చేతిలో ఉందని అలా చేస్తోందంటూ విమర్శించాడా? అనేది ఫాలోవర్స్‌కే వదిలేశాడు మస్క్. మరోవైపు రెడ్డిట్ వెబ్‌సైట్‌లో ఈ ట్వీట్‌పై పెద్ద రచ్చే నడుస్తోంది మరి!