Sanna Marin
-
మా విడాకులు.. ఇకపైనా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాం
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ విడాకుల ప్రకటన చేశారు. చిరకాల స్నేహితుడు.. భర్త మార్కస్ రైక్కోనెన్ నుంచి విడిపోబోతున్నట్లు ప్రకటించారామె. పదిహేనేళ్లకు పైగా కలిసే ఉన్న ఈ జంట.. కరోనా టైంలో మాత్రం వివాహ బంధంతో ఒక్కటైంది. వీళ్లకు ఐదేళ్ల పాప కూడా ఉంది. సన్నా మారిన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులపై ప్రకటన చేశారు. విడిపోతున్నప్పటికీ ఇకపైనా తాము బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతామని ప్రకటించారామె. ఒక కుటుంబంగా ఇకపైనా తాము కలుసుకుంటామని, జీవితంలో ముందుకు వెళ్తామని తెలిపారామె. ఇదిలా ఉంటే.. కిందటి నెలలో జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆమె త్వరలోనే ప్రధాని గద్దె నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 19 ఏళ్ల పాటు కొనసాగిన బంధానికి బ్రేకప్ చెప్పడానికి గల కారణాలను మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. రైక్కోనెన్ మాజీ ఫుట్‌బాలర్ మాత్రమే కాదు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కూడా. అత్యంత యంగ్ పీఎంగా 2019లో 37 ఏళ్ల ప్రాయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు సన్నా మారిన్. తద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో కరోనా టైంలోనూ ఆమె వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు -
డ్రగ్స్ టెస్ట్.. ఫిన్లాండ్ ప్రధానికి భారీ ఊరట
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్ టెస్ట్‌లకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్ ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా. ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
ఎలన్ మస్క్ వెటకారం! ప్రధానిని సైతం వదల్లేదు
Elon Musk Tweet On Finland PM: బిలియనీర్ ఆఫ్ ది ఎర్త్ ఎలన్ మస్క్ మరోసారి తన వెటకారం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా ఓ దేశ ప్రధానినే టార్గెట్ చేశాడు ఆయన. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్(36)ను ఉద్దేశిస్తూ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ని ఉద్దేశిస్తూ.. మస్క్ చేసిన ట్వీట్ ఇదే. pic.twitter.com/5LE1PjFwgS — Elon Musk (@elonmusk) December 12, 2021 కారణం ఇదేనా? ఫిన్లాండ్లో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో కొవిడ్ 19 నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సన్నా మారిన్ శనివారం ఓ నైట్‌క్లబ్ పార్టీకి వెళ్లారు. అయితే అంతకంటే ముందు ఫారిన్ మినిస్టర్ పెక్కా హవిస్టోతో భేటీ అయ్యారు. కాసేపటికే పెక్కాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో సన్నా.. తనకు తాను ఐసోలేట్ కాకుండా అలా పార్టీకి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లు.. పాజిటివ్ పేషెంట్‌ను కలిసినా ఐసోలేషన్ రూల్ పాటించాలనే రూల్ ఏం లేదు. కానీ, ప్రజారోగ్యం దృష్ట్యా పబ్లిక్ ప్లేసుల్లోకి మాత్రం వెళ్లకూడదు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో.. సన్నా మారిన్ ఫేస్బుక్ సాక్షిగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఎలన్ మస్క్ ఆమెపై చేసిన ట్వీట్లో మాత్రం ఆంతర్యం బోధపడడం లేదు. ఆమెను పవర్ఫుల్ అని పొగుడుతున్నాడా?.. లేదంటే అధికారం చేతిలో ఉందని అలా చేస్తోందంటూ విమర్శించాడా? అనేది ఫాలోవర్స్కే వదిలేశాడు మస్క్. మరోవైపు రెడ్డిట్ వెబ్సైట్లో ఈ ట్వీట్‌పై పెద్ద రచ్చే నడుస్తోంది మరి! చదవండి: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. టెస్లాకు గుడ్‌బై?