హెల్సెంకీ: ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ విడాకుల ప్రకటన చేశారు. చిరకాల స్నేహితుడు.. భర్త మార్కస్ రైక్కోనెన్ నుంచి విడిపోబోతున్నట్లు ప్రకటించారామె. పదిహేనేళ్లకు పైగా కలిసే ఉన్న ఈ జంట.. కరోనా టైంలో మాత్రం వివాహ బంధంతో ఒక్కటైంది. వీళ్లకు ఐదేళ్ల పాప కూడా ఉంది.
సన్నా మారిన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులపై ప్రకటన చేశారు. విడిపోతున్నప్పటికీ ఇకపైనా తాము బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతామని ప్రకటించారామె. ఒక కుటుంబంగా ఇకపైనా తాము కలుసుకుంటామని, జీవితంలో ముందుకు వెళ్తామని తెలిపారామె.
ఇదిలా ఉంటే.. కిందటి నెలలో జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆమె త్వరలోనే ప్రధాని గద్దె నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 19 ఏళ్ల పాటు కొనసాగిన బంధానికి బ్రేకప్ చెప్పడానికి గల కారణాలను మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. రైక్కోనెన్ మాజీ ఫుట్‌బాలర్ మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కూడా.
అత్యంత యంగ్ పీఎంగా 2019లో 37 ఏళ్ల ప్రాయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు సన్నా మారిన్. తద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో కరోనా టైంలోనూ ఆమె వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్‌ఏతో జన్మించిన శిశువు
Comments
Please login to add a commentAdd a comment