
పోస్టల్ స్టాంపులపై 'స్వలింగ' శృంగారం
స్టాంపులపై గే శృంగారమా? బుగ్గలు నోళ్లు నొక్కుకోకండి. మన దేశం ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కులకు సమాన హక్కుల గురించి మాట్లాడుతోంది. కానీ ఫిన్లండ్ లో పోస్టల్ స్టాంపులపై గే కల్చర్ ను ప్రతిబింబించే బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి.
ఈ మధ్యే ప్రముఖ గే చిత్రకారుడు టౌకో లాక్సోనెన్ వేసిన చిత్రాలతో ఫిన్లండ్ స్టాంపులను విడుదల చేసింది. మగటిమి ఉట్టిపడే నాలుగు చిత్రాలతో స్టాంపులు రూపొందించారు. ఈ చిత్రాలను ఇంకో ప్రముఖ చిత్రకారుడు టిమో బెర్రీ ఎంపిక చేశారు.
మన బోంట్లకు కాస్త కంగారు పుట్టించవచ్చునేమో కానీ ఈ చిత్రాలు ఫిన్లండ్ లో మాత్రం భలే సూపర్ హిట్! ఫిన్లండ్ లో సమలైంగిక వివాహాలకు ఆమోదం ఇవ్వాలని 1.66 లక్షల మంది సంతకాలు చేశారు.