సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతను, అంటే జ్వరం వచ్చిందా, లేదా తెలుసుకునేందుకు శరీరంలోని నరాల్లో పల్స్ రేటును, ఆక్సిజన్ రేటును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పలు వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ పనులన్నీ ఒకే పరికరం చేయడమే కాకుండా, మరింత సమర్థంగా పనిచేసే తల రింగు మార్కెట్లోకి వచ్చింది. ఫిన్‌లాండ్ కంపెనీ తయారు చేసిన ఈ తల రింగును 65 వేల మందిపైన ప్రయోగించి కాలిఫోర్నియా యూనివర్శిటీ, ఎంఐటీ లింకన్ ల్యాబ్‌కు చెందిన పరిశోధకులు పరీక్షించి చూశారు.
జ్వరం వచ్చిన తర్వాత జ్వరం ఉన్నట్లు చూపిస్తున్న వైద్య పరికరాలకన్నా ఈ పరికరాలు మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని, జ్వరం రావడానికి ముందే జ్వరం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతుందని పరిశోధకులు తేల్చారు. ఈ తల రింగులను ధరించి 50 మందికి కరోనా వైరస్ వచ్చిందని, వారిలో వైరస్ లక్షణాలను ఈ తల రింగులోని సెన్సార్లు ముందుగానే గ్రహించాయని తెలిపారు. దీని పనితీరును గమనిస్తే ఎవరైనా దీనిని ‘ఔరా’ అనాల్సిందేనని పరిశోధకులు వ్యాఖ్యానించారు. అందుకేనేమో దీనికి కంపెనీ వారు ‘ఔరా’ రింగులు అని నామకరణం చేశారు. ఫిన్‌లాండ్‌లోని ఫిన్నీష్ హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ ‘ఔరా హెల్త్’ తయారు చేసిన ఈ ‘ఔరార రింగు’ల ధరను 299 పౌండ్లు (దాదాపు 29 వేల రూపాయలు).
(చదవండి: కరోనా వ్యాక్సిన్ ధరలు ఎందుకెక్కువ?)
కరోనా: వీటి పనితీరుతో ‘ఔరా’ అనాల్సిందే!
Published Tue, Dec 15 2020 4:02 PM | Last Updated on Tue, Dec 15 2020 7:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment