ఒక్కసారి చార్జ్‌చేస్తే చాలు.. | put a one-time charge is enough | Sakshi
Sakshi News home page

ఒక్కసారి చార్జ్‌చేస్తే చాలు..

Published Wed, May 25 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

ఒక్కసారి చార్జ్‌చేస్తే చాలు..

ఒక్కసారి చార్జ్‌చేస్తే చాలు..

వాషింగ్టన్: ఒక్కసారి సెల్‌ఫోన్ చార్జ్ చేస్తే వారం వరకు చార్జింగ్ ఉండే బ్యాటరీని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి  ‘డిమీథైల్ ఫినజైన్’ అని పేరు పెట్టారు. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలలో ఉత్పత్తి అయిన విద్యుత్ ‘ఆక్సిడైజర్’లో నిల్వ ఉంటుంది. టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు లిథియం-ఎయిర్ (లిథియం-ఆక్సిజన్) బ్యాటరీకి కొన్ని మార్పులు చేసి చార్జింగ్ పెంచారు.

ఈ విధానంలో  లిథియం-ఎయిర్ బ్యాటరీలకు ‘ఎలక్ట్రోలైట్’ ఉత్ప్రేరకం, ఆక్సిజన్‌ను వాడి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ బ్యాటరీలు సాధారణ బ్యాటరీల కంటే పది రెట్లు ఎక్కువ సాంద్రత గల విద్యుత్‌ను నిల్వచేసుకుంటాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ కారుకు ఒక్కసారి చార్జ్ చేస్తే 640 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, మొబైల్‌ను ఒకసారి చార్జ్ చేస్తే వారం వరకు ఉంటుదని పరిశోధన సారథి కయాంజ్ చో వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement