ఒకరి ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్! | A man died due to current shoch while he tried to cell phone charging | Sakshi
Sakshi News home page

ఒకరి ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్!

Published Sat, Feb 6 2016 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

A man died due to current shoch while he tried to cell phone charging

కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి యత్నించిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని కమలాపూర్ మండలం కానిపర్తిలో శనివారం ఉదయం సంభవించింది.

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన దామెర రమేష్(45) బావమరిది నిశ్చితార్థంకు కానిపర్తికి వచ్చాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌కు  ఛార్జింగ్ పెట్టడానికి యత్నించగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రమేష్ అని పోలీసులు తెలిపారు. రమేష్ హఠాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement