సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై ఒకరు మృతి చెందారు.
ఆగలి: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఆగలి మండలంలోని పి. బ్యాడిగెరా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రహీమ్(35) ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం కర్ణాటక నుంచి వలస వచ్చిన రహీమ్ కుటుంబంతో కలిసి బ్యాడిగెరలో నివాసం ఉంటున్నారు.