ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ప్రో బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు 24గంటల్లో వెహికల్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పటికే పలువురు కొనుగోలు దారులకు అందించినట్లు ఓలా సంస్థ తెలిపింది.
ఓలా చైర్మన్, సీఈవో భవీష్ అగర్వాల్ ఎస్1 ప్రో వెహికల్స్ డెలివరీపై ట్వీట్ చేశారు. సాధారణంగా బైక్‌ను బుక్ చేసుకుంటే సంబంధింత ఆటోమొబైల్ కంపెనీలు,డీలర్ సంస్థలు సదరు వెహికల్‌ను కస్టమర్లకు అందించేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటాయి. కానీ ఓలా అలా కాదు. కేవలం 24గంటల్లో వెహికల్‌ను అందిస్తుందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Deliveries now happening in under 24hours from purchase!
— Bhavish Aggarwal (@bhash) May 23, 2022
Great work by the @OlaElectric team💪🏼👌🏼
Most other brands have months waiting. Even registrations take a few days in dealerships. The future is here, be a part of it! pic.twitter.com/4LG20pwuI9
మూడో సారి
గతేడాదిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. నాటి నుంచి ఈ ఏడాది వరకు మూడు సార్లు మాత్రమే పర‍్చేజ్ విండోను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. చివరి సారిగా మే21న 3వ సారి పర్చేజ్ విండోను విడుదల చేసింది.కాగా,ఈ పర్చేజ్ విండో అందుబాటులోకి తెచ్చే ముందే దేశంలో పలు నగరాల్లో టెస్ట్ రైడ్ క్యాంపెయినింగ్‌ను నిర్వహిస్తుంది.
చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్!
Comments
Please login to add a commentAdd a comment