Ola company
-
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త!
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ప్రో బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు 24గంటల్లో వెహికల్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పటికే పలువురు కొనుగోలు దారులకు అందించినట్లు ఓలా సంస్థ తెలిపింది. ఓలా చైర్మన్, సీఈవో భవీష్ అగర్వాల్ ఎస్1 ప్రో వెహికల్స్ డెలివరీపై ట్వీట్ చేశారు. సాధారణంగా బైక్‌ను బుక్ చేసుకుంటే సంబంధింత ఆటోమొబైల్ కంపెనీలు,డీలర్ సంస్థలు సదరు వెహికల్‌ను కస్టమర్లకు అందించేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటాయి. కానీ ఓలా అలా కాదు. కేవలం 24గంటల్లో వెహికల్‌ను అందిస్తుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Deliveries now happening in under 24hours from purchase! Great work by the @OlaElectric team💪🏼👌🏼 Most other brands have months waiting. Even registrations take a few days in dealerships. The future is here, be a part of it! pic.twitter.com/4LG20pwuI9 — Bhavish Aggarwal (@bhash) May 23, 2022 మూడో సారి గతేడాదిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. నాటి నుంచి ఈ ఏడాది వరకు మూడు సార్లు మాత్రమే పర్చేజ్ విండోను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. చివరి సారిగా మే21న 3వ సారి పర్చేజ్ విండోను విడుదల చేసింది.కాగా,ఈ పర్చేజ్ విండో అందుబాటులోకి తెచ్చే ముందే దేశంలో పలు నగరాల్లో టెస్ట్ రైడ్ క్యాంపెయినింగ్ను నిర్వహిస్తుంది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
Ola Electric: ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్ రాధా కృష్ణ గుడ్ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్ దుబ్ ప్రకటించారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, వాటి విడుదలలో కీరోల్ ప్లే చేస్తున్న టాప్ లెవల్ ఎక్జిక్యూటీవ్‌లు వదిలి వెళ్లిపోతుండడంతో ఓలా సీఈవో భవీష్ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ గతేడాది సెప్టెంబర్ 15న 'ఓలా ఎస్1, ఎస్1ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆ స్కూటర్లు అలా విడుదలయ్యాయో లేదో వాహనదారులు వాటిని ఎగబడి కొనుగోలు చేశారు.దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.1100కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మినట్లు ఆ సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇదో ఘనమైన రికార్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. సీన్ మారింది కట్ చేస్తే విడుదలైన ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో లోపాలు ఆ సంస్థ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. స్కూటర్లలో ఉన్న బ్యాటరీల పనితీరు కారణంగా అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ఆ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ యజమానులు గాయాలపాలవుతున్నారు.ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా అదే వెహికల్స్‌లో ఉన్న రివర్స్ మోడ్ ఆప్షన్ మోడ్ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నామంటూ బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఓలాను కుదిపేస్తుండగా.. అదే కారణాలతో ఓలా టాప్ లెవల్ ఎగ్జిక్యూటీవ్ లు వదిలి వెళ్లిపోతున్నారు. మనీ కంట్రోల్ కథనం ప్రకారం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో సాంకేతిక లోపాలు, టైం ప్రకారం డెలివరీ చేయకపోవడం, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నా..భద్రత విషయంలో ఆ సంస్థ పనితీరపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతుంటే..మరోవైపు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆ సంస్థలో కీరోల్ ప్లే చేస్తున్న ఉద్యోగులు అన్ని సర్దుకొని సంస్థ నుంచి బయటకు వెళ్లి పోతున్నారు. ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్ధుకొని ఇటీవల కాలంలో ఓలాకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్వయం సౌరభ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ పోర్వాల్, హెచ్ఆర్ హెడ్ రోహిత్ ముంజాల్, జనరల్ కౌన్సెల్ సందీప్ చౌదరిలు ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. సీటీవో దినేష్ రాధా కృష్ణన్‌తో పాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ నిష్క్రమించారు. కాగా, గత వారం ఓలా సీఈఓ అరుణ్ సిర్దేశ్‌ముఖ్, స్ట్రాటజీ చీఫ్ అమిత్ అంచల్ సంస్థను విడిచి వెళ్లిపోతున్నారంటూ మనీకంట్రోల్ నివేదించిన విషయం తెలిసింది. అన్ని తానై ముందుండి నడిపిస్తున్న అయితే సంస్థ ఉన్నత స్థాయి సిబ్బంది విడిచి వెళ్లిపోవడంతో ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా అన్నీ తానై సంస్థను ముందుండి నడిపిస్తున్నారు.రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్లోకి విడుదల చేసి..తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే పనిలో పడ్డారు ఓలా కోఫౌండర్, సీఈవో భవీష్ అగర్వాల్. చదవండి👉 బ్రాండ్ ఇమేజ్‌కి డ్యామేజ్ అయితే కష్టం.. భవీశ్‌కి ఎన్ని తిప్పలో.. -
ఓలా సరికొత్త బిజినెస్.. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ!
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సేవలు భారీగా పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాయి కంపెనీలు. ఆన్లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందించే ఓలా ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓలా కంపెనీ ఇప్పుడు కిరాణా సరుకుల డోర్ డెలివరీ సేవలు అందిస్తుంది. ఈ బిజినెస్‌లో భాగంగా ఓలా ముంబై, బెంగళూరు అంతటా ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. కంపెనీ రోజువారీగా సుమారు 10000 ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, ముంబైలోని కొన్ని కీలక ప్రాంతాల్లో 'ఓలా స్టోర్'ను తెరిచింది. రాబోయే నెలల్లో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా యాప్ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కిరాణా డెలివరీ వ్యాపారం కోసం ఓలా 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. జనవరి నాటికి కిరాణా సరుకుల ఫాస్ట్ డెలివరీ కోసం 300 ఓలా స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 55 క్లౌడ్ కిచెన్లను కలిగి ఉన్న ఈ సంస్థ, జనవరి నాటికి ఈ సంఖ్యను 150-160కు విస్తరించాలని యోచిస్తోంది. 2015 జూలైలో రైడ్-హైలింగ్ సంస్థ బెంగళూరులో ఒక స్టాండ్ ఎలోన్ ఆన్లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఆ సేవలను మూసివేసింది. రెడ్ సీర్ ప్రకారం, ఈ డోర్ డెలివరీ వ్యాపారం రాబోయే ఐదేళ్లలో 10-15 రెట్లు పెరిగి 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. (చదవండి: మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!) -
ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రోగులకు ఓలా ఫౌండేషన్ అభయహస్తం అందించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ బాధితుల వద్దకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా చేరవేసేందుకు ముందుకు వచ్చింది. ‘ఓ 2 ఫర్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఓలా ప్రతినిధులు కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదివేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఓలా హైదరాబాద్‌లో 500 కాన్సన్ట్రేటర్లను అందుబాటులోకి తెస్తోంది. ఓలా యాప్ ద్వారా సమాచారం తీసుకుని రోగులకు చేరవేయడంతోపాటు, తిరిగి వాటిని శానిటైజ్ చేసి రోగికి అందుబాటులోకి తెస్తారు. ప్రత్యేక్షంగా శిక్షణ పొందినవారితో ఓలా క్యాబ్స్ ద్వారా వీటిని కోవిడ్ రోగులకు అందుబాటులోకి తెస్తారు. స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధ పడుతున్న వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. రాజకీయనేతలు, అధికారులు, వివిధ వర్గాలవారు కోవిడ్ రోగులకు పలు రూపాల్లో సాయం అందిస్తున్నారని, అదేరీతిలో ఓలా ముందుకు రావడంపై రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి హర్షం వ్యక్తం చేశారు. మూడు, నాలుగు గంటల వ్యవధిలో బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓలా సీఓఓ గౌరవ్ పొర్వాల్, సేల్స్ హెడ్ సుమిత్ ఆనంద్ వెల్లడించారు. చదవండి: మేకప్ తీసేసి ట్రక్ ఎక్కింది -
ఓలా క్యాబ్స్‌లో రతన్ టాటాకు వాటాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినదీ, ఎంత వాటా తీసుకున్నదీ వెల్లడి కాలేదు. రతన్ టాటా ఇప్పటికే ఆన్లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ నుంచి చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ షియోమీ దాకా వివిధ స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాటా వంటి దిగ్గజం ఇన్వెస్ట్ చేయడం తమ కంపెనీకి మరింత గౌరవం తెచ్చిపెట్టిందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులు అగర్వాల్, అంకిత్ భాటియా కలిసి 2011లో ఓలాను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు దే శవ్యాప్తంగా 100 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 1.5 లక్షల పైచిలుకు వాహనాలు ఇందులో నమోదయ్యాయి. ఓలా మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు క్యాబ్స్, ఆటోలను బుక్ చేసుకోవచ్చు. -
ఓలా డ్రైవర్లకు ఎస్బీఐ కారు లోన్లు!
రోజూవారీ చెల్లింపులతో.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా కంపెనీ తమ కారు డ్రైవర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సహకారంతో ‘ఓలా ప్రగతి’ పేరుతో డ్రైవర్లకు కార్లోన్ తీసుకునే సౌకర్యాన్ని కలిగించింది. అది కూడా రోజువారీ చెల్లింపులతోనే అని ఎస్బీఐ సీజీఎం రజిని మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద లోన్‌కు అర్హులైన వారు 10 శాతం డౌన్ పేమెంట్ తో కార్‌ను సొంతం చేసుకోవటే కాకుండా కేవలం 24 గంటల్లోనే రుణాలు మంజూరవుతాయని పేర్కొన్నారు. సగటు వడ్డీ రేటు 13 శాతంగా నిర్ణయించినట్లు చెప్పారు. ‘‘డ్రైవర్లకు నెలసరి వాయిదాలు (ఈఎంఐ) చెల్లింపులంటే భారంగా ఉంటుంది. అందుకే వారి కోసం రోజూ వారీ చెల్లింపు పథకాన్ని ప్రారంభించినట్లు ఓలా వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రణయ్ జివరజ్కా ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో సుమారు లక్షమంది డ్రైవర్లు సొంతంగా కారును కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారాయన.