![Bhavish Aggarwal Says Hydrogen Very inefficient way of transporting electricity - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/06/18/15.jpg.webp?itok=8290_7QJ)
పెట్రోల్ డీజిల్‌కు ప్రత్యామ్నయ ఇంధనాలు ఉపయోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు తయారీకి ప్రోత్సహాం అందించారు. ఈ టెక్నాలజీతో తయారైన తొలి కారులో పార్లమెంటుకు కూడా చేరుకున్నారు. మరోవైపు పెట్రోలు/డీజిల్‌లకు బదులు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్‌లోకి తేవాలంటూ తయారీదారులకు కూడా సూచనలు చేశారు. నితిన్ గడ్కారీ వ్యాఖ్యాలకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు భవీశ్ అగర్వాల్.
హైడ్రోజనల్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ.. ‘ఎలక్ట్రిసిటీ ఉపయోగించి భార హైడ్రోజన్ (హెచ్2)ను తయారు చేస్తారు. ఈ హెచ్2ను అధిక పీడనాల వద్ద ఫ్యూయల్ స్టేషన్లలో నిల్వ ఉంచుతారు. దీన్ని తిరిగి ఫ్యూయల్ స్టేషన్ ద్వారా కార్లలో నింపుతారు. కార్లలో ఉన్న సెల్స్ ఈ హైడ్రోజన్ నుంచి తిరిగి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ శక్తితో కారు నడుస్తుంది. చూస్తుంటే రవాణా రంగంలో హైడ్రోజన్ వాడకం అంతగా ఉపయోగించే టెక్నాలజీలా అనిపించడం లేదు’ అన్నారు భవీశ్ అగర్వాల్.
భవీశ్ అగర్వాల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. దేశంలో ఇప్పుడు నంబర్ బ్రాండ్‌గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎదుగుతోంది. దీనికి తోడు త్వరలోనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు భవీశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రభుత్వం చెబుతున్న హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ అంత ఉపయోగకరం కాదంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.
చదవండి: హైడ్రోజన్ కారుతో పైలట్ ప్రాజెక్టు.. స్వయంగా ప్రయాణించిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment