ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. కృత్రీమ్.ఏఐని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2.30గంటలకు కృత్రీమ్.ఏఐ లాంచ్‌ను కృత్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Excited to showcase the potential of our AI. Tune in to the live launch event of Krutrim, India's own AI at 2:30PM tomorrow! Watch here: https://t.co/g7qmlHMuk1 pic.twitter.com/i7CrTrJYH1
— Bhavish Aggarwal (@bhash) December 14, 2023
ఈ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల‍్లో సొంత ఏఐ కుత్రిమ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పరిశ్రమలు, జీవన విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఏఐని 1.4 బిలియన్ల మందికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఏఐ మేడ్ ఇన్ ఇండియా
ప్రస్తుత టెక్ ప్రపంచంలో కృత్తిమ మేధ దూసుకుపోతుంది. మనదేశం కూడా సొంతంగా ఏఐని తయారు చేసే స్థాయికి ఎదగాలి. కానీ దేశీయ స్టార్టప్‌లు, వినియోగదారులు విదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నిపుణులతో తయారు చేసిన ఏఐని వినియోగిస్తున్నాయి. అలా కాకుండా భారతీయ భాషల్లో ఏఐని డెవలప్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment