ఎంతోకాలంగా ఊరిస్తూ వచ్చిన ఫీచర్లు త్వరలో తమ కస్టమర్లకి అందివ్వబోతున్నట్టు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. భారీ అంచనాల మధ్య మార్కెట్‌లోకి వచ్చింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే స్కూటర్ రిలీజ్‌కి ముందు చెప్పిన పలు ఆప్షన్లు మొదటి విడత కస్టమర్లకు అందలేదు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెస్తామంటూ భవీష్ అగర్వాల్ చేసిన ప్రకటన మార్కెట్‌లో సంచనలంగా మారింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. 2021 ఆగస్టు 15న స్కూటర్‌ని రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో మొత్తం డబ్బులు చెల్లించారు కస్టమర్లు. కానీ ముందుగా ప్రకటించిన సమయానికి స్కూటర్లు డెలివరీ చేయలేకపోయింది ఓలా. అక్టోబరు తర్వాత కస్టమర్లకు స్కూటర్లు అందించినా ముందుగా ప్రకటించిన అనేక ఫీచర్లు డిసేబుల్ మోడ్‌లో ఉంచింది.
దీంతో లేటెస్ట్ ఫీచర్లు అందివ్వాలంటూ నలువైపులా ఓలాపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఆ ఒత్తిడి నెగటివ్ ప్రచారానికి దారి తీసింది. దీంతో అప్రమత్తమైన ఓలా యాజమన్యం తాజాగా స్పందించింది. ఓలా స్కూటర్‌కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ 2.ఓ, కీ ఫీచర్స్, నావిగేషన్, కంపానియన్ యాప్, క్రూస్ కంట్రోల్, బ్లూటూత్ తదితర ఫీచర్లు 2022 ఏప్రిల్ చివరికల్లా అందిస్తామని భవీశ్ ప్రకటించారు.
MoveOS 2.0 almost ready and coming end April to everyone. Key features: navigation, companion app, cruise control, bluetooth, lots of performance improvements and more!
— Bhavish Aggarwal (@bhash) March 16, 2022
Comments
Please login to add a commentAdd a comment