రకుల్ ప్రీత్ సింగ్
ఎలాంటి అమ్మాయి కావాలి? అని సాధారణంగా అబ్బాయిల్ని అడిగితే ఫలానా హీరోయిన్‌లా ఉండాలి అని సమాధానం చెబుతారు. మరి ఏకంగా హీరోయిన్‌కే ఎలాంటి వాడు కావాలి? అంటే ‘గ్రీకువీరుడు...’ పాట పాడతారు. కానీ అదంతా సినిమాల్లో, నార్మల్ లైఫ్‌లో మూడు లక్షణాలు ఉండాలనుకుంటున్నాను అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూడు లక్షణాలు ఏంటంటే... నేను హీల్స్ వేసుకున్నా తనని తలెత్తుకు చూసేలా ఉండాలి. అంటే మంచి ఎత్తుండాలి. తనకు జీవితంలో ఓ ప్యాషన్ ఉండాలి. అది ఏ రంగంలో అయినా సరే. అందులో పెద్ద సక్సెస్‌ఫుల్ కానక్కర్లేదు. తన జీవితంలో ఒక విజన్‌తో ఉండాలి. ఇంక మూడోది.. నిజాయతీపరుడై ఉండాలి. సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగా ఉండాలి’’ అని పేర్కొన్నారు రకుల్.
Comments
Please login to add a commentAdd a comment