
కొచ్చి: ఈ–మొబిలిటీ స్టార్టప్ వాన్ ఎలక్ట్రిక్ మోటో.. అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ బైస్‌కిల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర అర్బన్‌స్పోర్ట్ రూ.59,999, అర్బన్‌స్పోర్ట్ ప్రో రూ.69,999 ఉంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. పెడల్ అసిస్టెడ్ రేంజ్ 60 కిలోమీటర్లు.
బైసికిల్ అభివృద్ధిలో ఇటలీ బ్రాండ్ బెనెల్లి సహకారం తీసుకున్నారు. విడదీయడానికి వీలున్న 2.5 కిలోల 7.5 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, కాంపాక్ట్ 6061 అల్యూమినియం యూనిసెక్స్ ఫ్రేమ్స్, డిస్క్ బ్రేక్స్, 7 స్పీడ్ గేర్ సిస్టమ్, 250 వాట్స్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్, స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి హంగులు ఉన్నాయి.
చదవండి: హట్‌కేకుల్లా అమ్ముడైన కోటి కార్లు..! దిగ్గజ కంపెనీలకు భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment