ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌లు
న్యూయార్క్: ట్విట్టర్ రెండు కొత్త ఫీచర్‌లతో మరింత యూజర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలకు తెరలేపింది. దీని ద్వారా ట్విట్లర్ మొబైల్ యాప్‌లో మీ ప్రముఖ సంభాషణలను కనుగొనడం ఇకమీదట సులభంగా మారనుంది.
ఇందులో భాగంగా ట్విట్టర్ మొబైల్ యాప్‌లో ‘రిప్లై కౌంటర్’, ‘కన్వర్సేషనల్ ర్యాంకింగ్’ అనే ఫిచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్‌ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే.. ట్విట్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్ ఆర్డర్‌లో కాకుండా వేరే విధంగా చూపిస్తాయి అని ‘ఎన్‌గాడ్జెట్’ బుధవారం వెల్లడించింది. ఈ ఫీచర్‌లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా.. ఒక ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం తెలుపుతాయి.