ఎంటర్‌టైన‍్మెంట్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ పై కన్నేసింది. ముఖ్యంగా మొబైల్ వెర్షన్‌లో చిన్నపిల్లలు గేమ్స్ ఆడే విధంగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఫేస్ బుక్ ఎగ్జిక్యూటీవ్ మైక్ వెర్దును గేమ్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఈ ఫీచర్ పై మైక్ వెర్దు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నాటికి కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు
వీడియో గేమ్ ను ఆడేస్తున్నారు
ప్రపంచ దేశాల్లో వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ఊపందుకుంది. మార్కెట్ పరిశోధన సంస్థ 'స్టాటిస్టా' రిపోర్ట్ లో 2012 నుంచి 2021 నాటికి వీడియో గేమింగ్ వినియోగం భారీగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. 2012లో 52.8 శాతంతో ప్రారంభమై 2021 నాటికి 138.4కి పెరిగింది. ముఖ్యంగా కరోనా క్రైసిస్‌లో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment