
హైదరాబాద్: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఆల్కజార్ మోడల్‌పై ఆటో వరల్డ్‌లో ఆసక్తి నెలకొంది. జూన్ 18న మార్కెట్‌లోకి రానున్న ఆల్కజార్ మోడల్‌కి సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన బ్రోచర్‌లో కారుకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ తెలిశాయి.
6 వేరియంట్లు
హ్యుందాయ్ ఆల్కజార్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తోంది. అవి ప్రెస్టీజ్ (ఎంటీ) , ప్రెజ్టీజ్ (ఓ) ఏటీ, ప్లాటినమ్ (ఎంటీ), ప్లాటినమ్ (ఓ) ఏటీ, సిగ్నేచర్ (ఎంటీ), సిగ్నేచర్ (ఓ) ఏటీలుగా ఉన్నాయి. ఇందులో ప్రెస్టీజ్ ఎంటీ వేరియంట్ ఆరు సీట్లు, ఏడు సీట్ల లే అవుట్‌తో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో 6 సీట్ల వేరియంట్‌లో పెట్రోల్ వెర్షన్‌లో లభిస్తున్న ఏకైక మోడల్‌గా ప్రెస్టీజ్ ఓ వేరియంట్ నిలిచింది.
కలర్ ఆప్షన్స్
హ్యుందాయ్ ఆల్కజార్ కలర్ ఆప్షన్స్‌కి సంబంధించి సింగల్ టోన్‌లో టైఫూన్ సిల్వర్, టైగాబ్రౌన్, పోలార్‌వైట్, టైటాన్ గ్రే, ప్లాటినమ్ బ్లాక్, స్టేరీ నైట్ మొత్తం ఆరు కలర్లు ఉండగా డ్యూయల్‌టోన్‌లో పోలార్ వైట్ ప్లాటినమ్ బ్లాక్, టైటాన్ గ్రే ఫాంటమ్ బ్లాక్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ ఫీచర్లు
7 సీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అనేక నూతన ఫీచర్లు ఆల్కజార్‌లో అందుబాటో ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచ్ మల్టీ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ వ్యూ మానిటర్, వెనుక వరుసలో కూర్చున్న వారికి వైర్‌లెస్ ఛార్జర్ ఆప్షన్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ బేస్డ్ సన్‌రూఫ్, కంఫర్ట్, ఏకో, స్పోర్ట్ డ్రైవింగ్‌మోడ్‌లతో పాటు ట్రాక‌్షన్ మోడ్ (మడ్, స్నో, శాండ్) తదితర ఆధునాత ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు.
చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్‌లెస్ కార్!
Comments
Please login to add a commentAdd a comment