
సాక్షి, ముంబై: రియల్‌మీ మరో అద్భుత స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్‌మీ 7 సిరీస్‌లో 7ఐ పేరుతో బడ్జెట్ ధరలో అందిస్తోంది. భారీ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది.
ధర, లభ్యత
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ రూ.11,999
4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రూ.12,999
అక్టోబరు 16 నుంచి రియల్‌మీ 7ఐ ఫోన్ సేల్స్ ప్రారంభం బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ.కామ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో 10శాతం డిస్కౌంట్ పాటు పేటీఎంపై క్యాష్‌బ్యాక్ సదుపాయం దీనికి కూడా వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది.
రియల్‌మీ 7ఐ ఫీచర్లు
6.50 అంగుళాల హెచ్‌డీ పంచ్ హోల్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
64+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment