మీ పాత ల్యాప్‌టాప్‌ను పగలకొట్టండి.. ప్రచారంలో కొత్త పంథా..! | Realme Sends Bosch Tool Kit For Laptop Testing | Sakshi
Sakshi News home page

Realme Book: మీ పాత ల్యాప్‌టాప్‌ను పగలకొట్టండి.. ప్రచారంలో కొత్త పంథా..!

Published Sat, Aug 14 2021 7:50 PM | Last Updated on Sat, Aug 14 2021 8:29 PM

Realme Sends Bosch Tool Kit For Laptop Testing - Sakshi

కోవిడ్‌-19 మహమ్మారి రాకతో ల్యాప్‌టాప్‌ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రజలు ఎక్కువగా వర్క్‌ ఫ్రమ్‌ హోంకే పరిమితమవ్వడంతో ల్యాప్‌టాప్‌ సేల్స్‌ భారీగా పెరిగాయి. ఆసుస్, డెల్, హెచ్‌పి, లెనోవో వంటి ల్యాప్‌టాప్‌ కంపెనీల కొనుగోళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  దీంతో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కూడా ల్యాప్‌టాప్‌ల తయారీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ కూడా ల్యాప్‌టాప్‌ ఉత్పత్తిపై దృష్టి సారించింది.

రియల్‌మీ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 18 (బుధవారం) రోజున లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ ల్యాప్‌టాప్‌ స్లిమెస్ట్‌ ల్యాప్‌టాప్‌గా నిలుస్తోందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ల్యాప్‌టాప్‌ ఫుల్‌గా మెటల్‌ బాడీతో ఉండనున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ ల్యాప్‌టాప్‌ లాంచ్‌లో భాగంగా పలువురు టెక్నికల్‌ నిపుణులకు కంపెనీ ఆహ్వానం పలికింది.

రియల్‌మీ ఆహ్వానం పలికిన విధానం చూస్తే మీరు ఔరా..! అనాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నికల్‌ ఎక్సపర్ట్‌ రంజిత్‌కు రియల్‌మీ ల్యాప్‌టాప్‌ లాంచింగ్‌ ఈవెంట్‌కు ఆహ్వానాన్ని పంపింది. ఆహ్వానంలో భాగంగా రంజిత్‌కు కంపెనీ భాష్‌ టూల్‌కిట్‌ను పంపింది. టూల్‌కిట్‌లో మీకు నచ్చిన టూల్‌తో ల్యాప్‌టాప్‌ను టెస్ట్‌ చేసుకోవచ్చునని రియల్‌మీ వెల్లడించింది. రంజిత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఒక ప్రొడక్ట్‌ ఈ విధంగా లాంచ్‌ చేయడం ఎప్పుడు చూడలేదని రంజిత్‌ తెలిపారు. రియల్‌మీ ల్యాప్‌టాప్‌ ప్రచారంలో సరికొత్త పంథాను పాటిస్తుందని టెక్నికల్‌ నిపుణులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement