సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ కూడా త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించ నున్నది. ఈ విషయాన్ని రియల్‌మీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. తద్వారా ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లతో ఆకట్టు కుంటున్న శాంసంగ్, హువావే వివో, ఒప్పో, టెక్నో, మోటరోలా, షావోమీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
సీఈవో మాధవ్ సేథ్ తమ ఫోల్డబుల్ ఫోన్ గురించి ట్వీట్ చేశారు రియల్‌మీఫోల్డ్, రియల్‌మీ ఫ్లిప్ ఈ రెండింటిలో ఏది కావాలి అని ప్రశ్నించారు. తద్వారా రియల్‌మీ ఫోల్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై కీలక సంకేతాలిచ్చారు.
మరోవైపు 2022 నవంబరులోనే రియల్‌మీ చైనా వైస్ ప్రెసిడెంట్ జుక్వి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఎఫర్డబుల్ ఫోల్డబుల్‌పై పనిచేస్తోందని హింటిచ్చారు. ప్రతీ ఏడాది రెండు GT నియో-బ్రాండెడ్ ఫోన్‌లు, నంబర్ సిరీస్ ఫోన్‌లు రెండు, ఒక GT సిరీస్ మోడల్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు.
కాగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ , Z ఫ్లిప్ తోపాటు, షావోమీ మిక్స్ ఫోల్డ్2, మోటరోలా రేజర్, ఒప్పో ఫైండ్ ఎన్2 ప్లిప్, టెక్నో పాంథమ్ వీ ఫోల్డ్ వంటి ఆప్షన్‌లతో ఫోల్డబుల్ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే వన్‌ప్లస్, పిక్సెల్ ఫోల్డబుల్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ఇకపై రియల్‌మీ కూడా చేరనుంది.
What do you want next… #realmeFlip or #realmeFold?
— Madhav Sheth (@MadhavSheth1) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment