
సాక్షి. న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ల రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. 5జీస్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థల మధ్య పోటీ ఊపందుకున్న నేపథ్యంలో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ‘ఎక్స్50 ప్రొ’ పేరుతో విడుదల చేయనుంది. న్యూఢిల్లీలో నేడు ( సోమవారం) మధ్నాహ్నం ‘ఎక్స్50 ప్రొ’ లాంచ్ చేయనుందని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు.
(చదవండి : స్మార్ట్‌టీవీ రంగంలోకి దూసుకొస్తున్న రియల్‌మీ)
కాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 +8+ 2 +2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ 8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను అమర్చినట్టు సమాచారం. అలాగే సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించనుందని అంచనా. డ్యూయల్-మోడ్ 5 జి కనెక్టివిటీ, 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేయనుంది. బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించపోయినప్పటికీ వూక్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ వల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ టీజర్‌ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ధర : సుమారు రూ. 50,000
Few hours before the launch of #realmeX50Pro!
— Madhav 5G (@MadhavSheth1) February 24, 2020
So guys can you tell us how many 'India First' features are we bringing with the #real5G?
RT & reply with the correct number using #realmeX50Pro and stand a chance to win one.
Livestream begins at 2:30PM.https://t.co/8pkvjxXwcl