సాక్షి, ముంబై: రియల్‌మి సంస్థ భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లాంచ్ చేసింది. రియల్ మి సీ సిరీస్‌లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ కా సూపర్ స్టార్ పేరుతో రియల్‌మి సీ3ని ఆవిష్కరించింది. 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీసీ 1 సీ2 స్మార్ట్‌ఫోన్లకు ఇండియాలో మంచి ఆదరణ లభించిందని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల 10 మిలియన్ యూనిట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు.
రియల్‌మీ సీ3 ఫీచర్లు
6.5 అంగుళాల హెచ్‌డి + స్క్రీన్
ఆండ్రాయిడ్ 10
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 70 సాక్
12+2 ఎంపీ రియల్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు
బేస్ వేరియంట్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ రూ. 6,999
హై ఎండ్ వేరియంట్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ రూ. 7.999.
రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల (మధ్యాహ్నం) నుంచి అమ్మకానికి లభ్యం. త్వరలో ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఆఫర్ల విషయానికొస్తే రియల్‌మే సీ3 కొనుగోలుదారులకు రూ. 7,550 రిలయన్స్ జియో ఆఫర్.
Presenting #EntertainmentKaSuperstar #realmeC3 starting at ₹6,999.
— realme (@realmemobiles) February 6, 2020
-MediaTek Helio G70 AI Processor
-5000mAh Battery
-16.5cm (6.5") mini-drop full screen display
-AI Dual Rear Camera
1st sale starts at 12 PM, 14 Feb on @Flipkart & https://t.co/HrgDJTZcxvhttps://t.co/VIVwlwDtaT pic.twitter.com/Pd6mQF0zww
Comments
Please login to add a commentAdd a comment