ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ నేడు (సెప్టెంబర్ 9) తన తొలి ట్యాబ్లెట్ పరికరాన్ని బడ్జెట్ ధరలో భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మీ కంపెనీ తొలి ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మోస్ సౌండ్, ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ వై-ఫై, వై-ఫై + 4జీ అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. ఈ రియల్ మీ ప్యాడ్ తో పాటు లాంచ్ సమావేశంలో రియల్ మీ కాబుల్, రియల్ మీ పాకెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ల కూడా లాంచ్ చేసింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట)
భారతదేశంలో ఈ రియల్‌మీ ప్యాడ్ 3జీబీ + 32జీబీ స్టోరేజ్ వై-ఫై ఓన్లీ వేరియెంట్ ధర రూ.13,999గా ఉంది. అదే వై-ఫై + 4జీ వేరియెంట్ ధర రూ.15,999(3జీబీ + 32జీబీ), 4జీబీ + 64జీబీ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. రియల్ మీ ప్యాడ్ వై-ఫై + 4జీ మోడల్స్ సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, Realme.com, ప్రధాన ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి వస్తాయి. హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ కార్డు లేదా ఈజీ ఈఎమ్ఐ లావాదేవీల ద్వారా రియల్ మీ ప్యాడ్ కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులకు కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు
- 10.4 అంగుళాల డబ్ల్యుఎక్స్ జీఏ+ (2,000ఎక్స్1,200 పిక్సెల్స్) డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ ఓఎస్
- మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్ + 64జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజీ
- 8 మెగాపిక్సెల్ కెమెరా (105 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ)
- 7,100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
- 18డబ్ల్యు క్విక్ చార్జర్
- 440 గ్రాముల బరువు
Comments
Please login to add a commentAdd a comment