Tablet phones
-
మోటో ట్యాబ్ జి20, ట్యాబ్లెట్ మార్కెట్లోకి మోటరోలా ఎంట్రీ
మోటరోలా ట్యాబ్లెట్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. మోటో ట్యాబ్ జి20ను విడుదల చేసింది. 8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో, టీడీడీఐ టెక్నాలజీతో మెరుగైన టచ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో కూడిన ట్యాబ్లెట్లో మీడియా టెక్ హీలియో పీ22టీ ఆక్టాకోర్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది. ఈనెల 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై బుక్ చేసుకోవచ్చని.. ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ, యాక్సిస్ కా ర్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. -
బడ్జెట్ ధరలో విడుదలైన రియల్మీ తొలి ట్యాబ్లెట్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ నేడు (సెప్టెంబర్ 9) తన తొలి ట్యాబ్లెట్ పరికరాన్ని బడ్జెట్ ధరలో భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్మీ కంపెనీ తొలి ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ అట్మోస్ సౌండ్, ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ వై-ఫై, వై-ఫై + 4జీ అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. ఈ రియల్ మీ ప్యాడ్ తో పాటు లాంచ్ సమావేశంలో రియల్ మీ కాబుల్, రియల్ మీ పాకెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ల కూడా లాంచ్ చేసింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట) భారతదేశంలో ఈ రియల్మీ ప్యాడ్ 3జీబీ + 32జీబీ స్టోరేజ్ వై-ఫై ఓన్లీ వేరియెంట్ ధర రూ.13,999గా ఉంది. అదే వై-ఫై + 4జీ వేరియెంట్ ధర రూ.15,999(3జీబీ + 32జీబీ), 4జీబీ + 64జీబీ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. రియల్ మీ ప్యాడ్ వై-ఫై + 4జీ మోడల్స్ సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, Realme.com, ప్రధాన ఆఫ్ లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి వస్తాయి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కార్డు లేదా ఈజీ ఈఎమ్ఐ లావాదేవీల ద్వారా రియల్ మీ ప్యాడ్ కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులకు కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు 10.4 అంగుళాల డబ్ల్యుఎక్స్ జీఏ+ (2,000ఎక్స్1,200 పిక్సెల్స్) డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ ఓఎస్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజీ 8 మెగాపిక్సెల్ కెమెరా (105 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ) 7,100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 18డబ్ల్యు క్విక్ చార్జర్ 440 గ్రాముల బరువు -
ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని దేశాలు లాక్డౌన్లు విధించాయి. కరోనా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులకు వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకు ట్యాబ్లెట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యకు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 ఖరీదు చేసే ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్ పంకజ్ హర్జై తెలిపారు. కాగా ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో చిన్నారులకు అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్జై స్పష్టం చేశారు. ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ ఉందని మహేష్ టెలికం సంస్థకు చెందిన వ్యాపారి మనీష్ ఖత్రి పేర్కొన్నారు. కాగా మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు తక్కువ ఖర్చుతో అత్యధిక క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు రూ.20,000నుంచి రూ.30,000 ధరకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనివ్వడానికి మొగ్గు చూపేవారు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: 'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది') -
మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ కొనిస్తున్నారా?
జాగ్రత్త ఈ రోజుల్లో పది పన్నెండేళ్లు దాటిన చిన్నారులు కాస్త మారాం చేయగానే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ ఫోన్లు కొనివ్వడం తలిదండ్రులకు మామూలైపోయింది. అయితే ఆ ఫోన్ కొనిచ్చిన కొద్దిరోజుల తర్వాత కానీ వారికి తెలియడం లేదు... తామెంత తప్పు చేశామనేది. ఫోన్లు... ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లు పిల్లల నిద్రను దూరం చేస్తాయని, చదువును చెడగొడతాయని, వారికి, తోటి పిల్లలతో స్నేహ సంబంధాలను దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండువేలమందికి పైగా ప్రాథమికోన్నత, హైస్కూలు స్థాయి చిన్నారులపై నిర్వహించిన ఈ సర్వేలో తేలినదేమిటంటే- పొద్దస్తమానం టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం వల్లనే పిల్లల చదువు దెబ్బతింటుంద ని ఇంతవరకు వాపోతున్నారు పెద్దలు. అయితే స్మార్ట్ఫోన్లు, టాబ్లు వంటివి వాడే పిల్లల పరిస్థితి వీరికన్నా మరింత దారుణంగా తయారవుతున్నట్లు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. వెండితెరకన్నా బుల్లితెర, బుల్లితెరకన్నా కంప్యూటర్ తెర, కంప్యూటర్ తెరకన్నా ఫోన్ స్క్రీన్ చిన్నారులను నిద్రకు మరింతగా దూరం చేస్తాయని, తగినంత నిద్రలేని పిల్లలు చదువులోనే కాకుండా, ఇతర విషయాల్లో కూడా వెనకబడతారని వీరంటున్నారు. కాబట్టి మీ స్మార్ట్కిడ్స్కు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చేముందు మరికాస్త స్మార్ట్‌గా ఆలోచించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.