న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులకు వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకు ట్యాబ్లెట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యకు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 ఖరీదు చేసే ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్ పంకజ్ హర్‌జై తెలిపారు. కాగా ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో చిన్నారులకు అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్‌జై స్పష్టం చేశారు.
ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ ఉందని మహేష్ టెలికం సంస్థకు చెందిన వ్యాపారి మనీష్ ఖత్రి పేర్కొన్నారు. కాగా మార్కెట్‌లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు తక్కువ ఖర్చుతో అత్యధిక క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు రూ.20,000నుంచి రూ.30,000 ధరకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనివ్వడానికి మొగ్గు చూపేవారు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: 'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది')
Comments
Please login to add a commentAdd a comment