లెనోవో నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ: మరో రెండు కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లు భారత్ మార్కెట్లోకి వచ్చాయి. చైనా కంపెనీ లెనోవో బుధవారం కొత్త మోడల్స్ వైబ్ పీ1, వైబ్ పీ1 ఎమ్ ను విడుదల చేసింది. వైబ్ పీ1 మొబైల్ ధర 15,999, వైబ్ పీ1 ఎమ్ ధర .7,999 రూపాయలు.
వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. వైబ్ పీ1ఎమ్ మోడల్స్ను వెంటనే ఆన్లైన్ విక్రయిస్తుండగా.. వైబ్ పీ1 ఫోన్లను వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. వైబ్ పీ1 మొబైల్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, యూఎస్బీ, పవర్ సేవ్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక వైబ్ పీ1 ఎమ్లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ తొందరగా ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది.