
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్‌లో అందుబాటు ధరల్లో ఇన్‌ఫినిటీ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లుగా సోమవారం వీటిని విడుదల చేసింది. జే 6, జే8, ఏ6, ఏ6ప్లస్ పేర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ముఖ‍్యంగా ఈ నాలుగు డివైజ్‌లను ఆండ్రాయిడ్ ఓరియో ఆధారితంగా రూపొందించడం విశేషం. స్టైలిష్ డిజైన్ల కోసం ఎదురు చూసే వినియోగదారుల కోసం తాజా ఇన్నోవేషన్‌తో వీటిని అందుబాటులోకి తెచ్చామని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ6
5.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
16 ఎంపీ రియర్ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
కొత్తగా విడుదల చేసిన ఫోన్ల గురించి వివరిస్తున్న శాంసంగ్ ప్రతినిధి
శాంసంగ్ గెలాక్సీ ఏ6 ప్లస్
6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 450 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
256 దాకా విస్తరించుకునే అవకాశం
16+5 ఎంపీ రియర్‌కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3,500ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ జే6
5.6-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
13 ఎంపీ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
గెలాక్సీ జే8
6అంగుళాలసూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 450 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
16+5 ఎంపీ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3500ఎంఏహెచ్ బ్యాటరీ
ఏ6, ఏ6ప్లస్, జే6 మే 22నుంచి అమెజాన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. అయితే జే 8మాత్రం జూలై తర్వాత అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ తెలిపింది. పేటీఎం మాల్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి.
ఇక ఈనాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి.
జే 6 ధర: రూ.13,990
జే 8 ధర: రూ. 18,990
ఏ6 ధర: రూ. 21,990 (4జీబీ/32 స్టోరేజ్), రూ. 22,990 4జీ/64జీబీ
ఏ6ప్లస్ ధర : రూ. 25,990
Comments
Please login to add a commentAdd a comment