
సాక్షి, ముంబై: వోటో మొబైల్స్ కంపెనీ వరుసగా నాలుగు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వి11, వి12, వి3, వి5ఎక్స్ పేరుతో, బడ్జెట్ ధరల్లో భారత మార్కెట్‌లో తాజాగా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ , డ్యుయల్ సెల్ఫీ కెమెరా లాంటి మంచి ఫీచర్లును వీటిల్లో పొందుపర్చింది. నాలుగు స్మార్ట్‌ఫోన్లను బ్లాక్, బ్లూ, రెడ్, షాంపైన్ కలర్స్‌లలో అందుబాటులోకి తెచ్చింది. అలాగే నాలుగు డివైస్‌లలో 128జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశాన్ని ఇచ్చింది.
వోటో 11
5 అంగుళాల డిస్‌ప్లే
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జీబీ స్టోరేజ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
వోటో వి3
5.2 అంగుళాల డిస్‌ప్లే
13 ఎంపీ రియర్ కెమెరా
16 జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
వోటో వి12
5అంగుళాల డిస్‌ప్లే
క్వార్డ్ కోర్ 1.3గిగా హెడ్జ్ ప్రాసెసర్
720 x 1280 రిజల్యూషన్
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
13ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సర్
వోటో వి5 ఎక్స్
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జీబీ స్టోరేజ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సర్
ధరలు : వోటో వి11, వి12, వి3, వి5ఎక్స్ ఫోన్ల ధరలు రూ.4,999 - రూ.6,999 మధ్య ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో ఈస్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment