
హువాయ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు
న్యూఢిల్లీ: హువాయ్ తన ఆనర్ శ్రేణిలో 4ఎక్స్, 6 ప్లస్ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.10,499, రూ.26,499గా ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యం అవుతున్నాయి. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘ఆనర్ 6 ప్లస్’ మొబైల్ 5.5 అంగుళాల తెర, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరి, 4జీ, 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. కిట్‌క్యాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ‘4ఎక్స్’ మొబైల్‌లో 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరి, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐడీసీ ప్రకారం, హువాయ్ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 6.25 శాతం వాటాతో నాల్గో స్థానంలో ఉంది. గతేడాది 3 లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించిన హువాయ్ ఈ ఏడాది 20 లక్షల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది.