
శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను గెలాక్సీ ఎస్ 9, ఎస్9 ప్లస్‌ను ఫిబ్రవరి 25 ఆదివారం, లాంచ్ చేసింది. స్పెయిన్ ,బార్సెలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రారంభానికి ఒక్క రోజుముందు ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. మార్చి 2 ప్రి ఆర్డర్స్ మొదలు కానుండగా, 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్9 ప్లస్‌లో ద్వంద్వ రియర్ కెమెరాలను, అలాగే ఫేస్ రికగ్నిషన్, ఎఆర్ (అగ్‌మెంటెట్ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది.
రెండు హ్యాండ్ సెట్లు మిడ్ నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్ టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్9 ధర సుమారు రూ .46,600, ఎస్9 ప్లస్ ధర సుమారు రూ .54,400గా ఉండే అవకాశం ఉంది. అలాడే రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్ స్టీరియో సౌండ్ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్ ఎక్స్ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది.
గెలాక్సీ ఎస్ 9 ఫీచర్లు
5.8కర్వ్‌డ్ సూపర్ ఎమోలెడ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 8 ఓరియో
1440 x 2960 పిక్సెల్స్ రిజల్యూషన్
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
12ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ,
గెలాక్సీ ఎస్ 9 ప్లస్ ఫీచర్లు
6.2 డిస్‌ప్లే
6జీబీ ర్యామ్
1440x2960 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8 ఓరియో
64జీబీ స్టోరేజ్
256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
డబుల్ రియర్ కెమెరాలు ప్రత్యేక ఫీచర్లుగా ఉండనున్నాయి.
Words can't say what your face can. Tell volumes of your own stories with a camera that turns you into an emoji. #GalaxyS9. Learn more. https://t.co/1HCinmcKeR pic.twitter.com/vCBEXj2koq
— Samsung Mobile (@SamsungMobile) February 25, 2018
Comments
Please login to add a commentAdd a comment