సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ప్రతీ ఏడాది ఆరంభంలో ఎస్ సిరీస్ గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చే సంస్థ గెలాక్సీ వెర్షన్‌లో ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఈ మోడళ్లను బుధవారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బిగ్ సి షోరూంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత లాంచ్ చేశారు. సినిమాటిక్ ఇన్ఫినిటీ ఓ- డిస్ల్పే, ఎన్‌హ్యాన్స్‌డ్ కెమెరా, ఇన్-డిస్ల్పే ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి అధునాతన ఫీచర్లు ఈ మోడల్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
గెలాక్సీ ఎస్10ఈ కేవలం 128 జీబీ వేరియంట్‌లో మాత్రమే లభించనుంది. ప్రారంభ ధర. రూ. 55,900గా ఉంది. అలాగే ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ యూజర్లకు అదనపు డేటా ప్రయోజనాలతో పాటు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది.
గెలాక్సీ ఎస్10 ఫీచర్లు
6.1 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్‌డ్ స్క్రీన్
ఆండ్రాయిడ్ 9.0 పై
8 జీబీ ర్యామ్,128 స్టోరేజ్
16 +12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
10 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
128జీబీ, 512జీబీ స్టోరేజ్ రెండు రియంట్లలో లభ్యం.
గెలాక్సీ ఎస్10 ప్లస్
6.4 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్
ఆండ్రాయిడ్ 9.0 పై
12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్
12+12+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
128జీబీ, 512జీబీ,1 టెర్రా బైట్ మూడు వేరియంట్లలో లభ్యం.
1 టీబీ వేరియంట్ ధర రూ. 1,17,900
512 జీబీ వేరియంట్ ధర రూ. 91,900
128 జీబీ వేరియంట్ ధర రూ. 73,900
గెలాక్సీ ఎస్10ఈ
5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్
కర్వ్‌డ్ డిస్‌ప్లే లేదు
ఆండ్రాయిడ్ 9.0 పై
16+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
10ఎంపీ సెల్ఫీ కెమెరా
6/8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : రూ.55,900
బ్లాక్, సియాన్, బ్లూ, ఎల్లో రంగుల్లో లభ్యం.
కాగా ఇప్పటికే ఈ మోడళ్లను శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఫిబ్రవరి 20న అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశీయ ప్రీమియం మార్కెట్‌లో మంచి ఆదరణ ఉన్న యాపిల్ ఐఫోన్, గూగుల్ పిక్సెల్ మోడళ్లకు ఈ నూతన గెలాక్సీ మోడళ్లు గట్టి పోటీ ఇస్తాయని సంస్థ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment