బీజింగ్: లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. లెనోవా కే 12 , లెనోవా కే 12 ప్రో పేరుతో మోటో ఈ 7 ప్లస్ , మోటో జీ 9 పవర్ ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లుగా చైనాలో తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లను పొందుపర్చింది.
లెనోవా కె 12, లెనోవా కె 12 ప్రో: ధరలు
లెనోవా కే 12 ( 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) ధర సుమారు రూ. 9,000 ఇది గ్రేడియంట్ బ్లూ మరియు గ్రేడియంట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెనోవా కె 12 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 11,300. ఇది పర్పుల్ , గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-సేల్ కోసం సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 12 నుండి అమ్మకాలు ప్రారంభం. ఇండియా తదితర మార్కెట్లో ఇవి ఎపుడు లభ్యమయ్యేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
లెనోవా కే12 ఫీచర్లు
6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460సాక్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
48+2 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
లెనోవా కె 12 ప్రో ఫీచర్లు
6.8-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే
720x1,640 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 సాక్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 512 జీబీ స్టోరేజ్‌ను వరకు విస్తరించుకునే అవకాశం
64+ 2 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment