
నేడు వెంకయ్యకు పౌరసన్మానం
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. అనంతరం దిల్‌కుషా అతిథి గృహం ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.