కరీంనగర్ క్రైం : జిల్లా పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను జిల్లా ఎస్పీ శివకుమార్ మంగళవారం శాలువాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో డీసీఆర్‌బీ డీఎస్పీ సంజీవ్‌రావు, ఎఆర్ ఎస్సైలు కె.దేవేందర్‌రెడ్డి, జియా ఉల్ షరీఫ్(ఏఆర్- కరీంనగర్), ఏఎస్సై సత్యానారాయణ(ట్రాఫిక్- కరీంనగర్ పీఎస్), హెడ్‌కానిస్టేబుల్ షేక్ అబ్దుల్బ్(్రఏఆర్- కరీంనగ ర్) ఉన్నారు.
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు కుటుంబసభ్యులను ఎస్పీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈకార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయిడు, డీఎస్పీలు ప్రభాకర్, కోటేశ్వర్‌రావు, ఆర్‌ఐలు గంగాధర్, సెక్షన్ అధికారి రాధాకృష్ణారెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్, రవికాంత్, మల్లయ్య, లింగమూర్తి పాల్గొన్నారు.