
మిథాలీరాజ్‌కు జ్ఞాపిక ఇస్తున్న ఏసీఏ ప్రధాన కార్యదర్శి
విజయవాడ స్పోర్ట్స్ :భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ అరుణ్‌కుమార్ జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. ప్రతి ఏడాది ఏదైనా అంతర్జాతీయ టూర్‌కి వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ఏసీఏ కోచ్ జె.కృష్ణారావు వద్ద శిక్షణ తీసుకోవడం ఆనవాయితీ. వరల్డ్ కప్ పోటీలకు వెళ్లే ముందు కూడా మిథాలీరాజ్ మంగళగిరి ఏసీఏ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు.
కాగా, త్వరలో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి మంగళగిరిలో మిథాలీరాజ్ శిక్షణ తీసుకున్నారు. అయితే, మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చివరి రోజున మాత్రం జ్ఞాపిక ఇస్తున్నట్లు ఫొటోతో ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. జ్ఞాపిక ఇస్తున్న కార్యక్రమంలో ఏసీఏ ప్రధాన కార్యదర్శితో పాటు మీడియా మేనేజర్ సీఆర్ మోహన్, మిథాలీరాజ్ తండ్రి దొరై రాజ్ పాల్గొన్నారు.