mithaliraj
-
జెమీమా ‘సూపర్’
జైపూర్: మహిళల టి20 లీగ్‌లో సూపర్నోవాస్ ‘ఆఖరి’ విజయంతో ముందడుగు వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో నోవాస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీపై నెగ్గింది. మెరుగైన రన్‌రేట్‌తో సూపర్నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. ట్రయల్‌బ్లేజర్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (48 బం తుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించింది. అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసి ఓడింది. డానియెల్లి వ్యాట్ (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సూపర్నోవాస్, వెలాసిటీల మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జెమీమా ధాటిగా... టాస్ నెగ్గిన వెలాసిటీ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది. ప్రియా పూనియాతో కలిసి సూపర్నోవాస్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జయంగని ఆరంభంలో బౌండరీలతో ఆకట్టుకుంది. ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్ చేర్చింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోవడంతో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ సూపర్ నోవాస్‌కు వెన్నెముకగా నిలిచింది. జయంగనితో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించింది. తర్వాత జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక... సోఫీ డివైన్‌తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఫోర్లతో వేగం పెంచిన జెమిమా ఈ క్రమంలో 31 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్ మాత్రం ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి ఓవర్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలోనే తడబాటు అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెలాసిటీ తడబడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్, టీనేజీ బ్యాట్స్‌మన్ షఫాలీ వర్మ (2), 22 వద్ద హేలీ మాథ్యూస్ (11) పెవిలియన్ చేరడంతో వెలాసిటీ కష్టాల్లో పడింది. ఈ దశలో డానియెల్లీ వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నారు. వెటరన్ బ్యాట్స్‌మన్ మిథాలీ నింపాదిగా ఆడుతుంటే... వ్యాట్ రెండు భారీ సిక్సర్లతో మెరిపించింది. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి వెలాసిటీ స్కోరు 68/2. మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించిన వ్యాట్... పూనమ్ ఓవర్లో క్లీన్‌బౌల్డయింది. తర్వాత మిథాలీకి వేద కృష్ణమూర్తి (29 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు) తోడైంది. కానీ పరుగుల రాక మందగించడంతో చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ పోయింది. వెలాసిటీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు చేయాలి. అయితే సూపర్ నోవాస్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో భారీషాట్లకు అవకాశం లేకపోయింది. ఆఖరి 6 బంతులకు 23 పరుగులు చేయాల్సివుండగా... 10 పరుగులే చేసి ఓడింది. -
వేదపై వేటు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత మహిళల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. హేమలత కళ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించింది. సారథులుగా వన్డేలకు మిథాలీరాజ్‌ను, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కొనసాగించింది. అయితే ఇరుజట్ల నుంచి వేద కృష్ణమూర్తిని తొలగించారు. ఫామ్ లో లేకపోవడంతో ఆమెను కివీస్ టూర్‌కు ఉద్వాసన పలికారు. ఆమె స్థానంలో వన్డే జట్టులోకి మోనా మేష్రమ్, టి20లో కొత్తమ్మాయి ప్రియా పూనియాను ఎంపిక చేశారు. పూజ వస్త్రకర్ గాయపడటంతో టి20 జట్టులో ఆమె స్థానాన్ని శిఖాపాండేతో భర్తీ చేశారు. జనవరి 24 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడుతుంది. టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇది. గురువారం అమ్మాయిల జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. వన్డే జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ, తానియా భాటియా, మోనా మేష్రమ్, ఏక్తాబిష్త్, మాన్సి జోషి, హే మలత, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖాపాండే. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, మిథాలీ, దీప్తి, జెమీమా, అనూజ, హేమలత, మాన్సి, శిఖా పాండే, తానియా, పూనమ్, ఏక్తా బిష్త్, రాధ, అరుంధతి రెడ్డి, ప్రియాపూనియా. -
క్రికెటర్ మిథాలీరాజ్‌కు సత్కారం
విజయవాడ స్పోర్ట్స్ :భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ అరుణ్‌కుమార్ జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. ప్రతి ఏడాది ఏదైనా అంతర్జాతీయ టూర్‌కి వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ఏసీఏ కోచ్ జె.కృష్ణారావు వద్ద శిక్షణ తీసుకోవడం ఆనవాయితీ. వరల్డ్ కప్ పోటీలకు వెళ్లే ముందు కూడా మిథాలీరాజ్ మంగళగిరి ఏసీఏ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. కాగా, త్వరలో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి మంగళగిరిలో మిథాలీరాజ్ శిక్షణ తీసుకున్నారు. అయితే, మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చివరి రోజున మాత్రం జ్ఞాపిక ఇస్తున్నట్లు ఫొటోతో ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. జ్ఞాపిక ఇస్తున్న కార్యక్రమంలో ఏసీఏ ప్రధాన కార్యదర్శితో పాటు మీడియా మేనేజర్ సీఆర్ మోహన్, మిథాలీరాజ్ తండ్రి దొరై రాజ్ పాల్గొన్నారు. -
15న పోలీస్ మెమోరియల్ రన్
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని (అక్టోబర్ 21) పురస్కరించుకొని అక్టోబర్ 15న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసుశాఖ ‘మెమోరియల్ రన్’ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం డీజీపీ కార్యాలయంలో ఇండియన్ పోలీస్ అమరవీరుల మెమోరియల్ రన్ (ఐపీఎంఎంఆర్) వెబ్సైట్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలతోపాటు ప్రచార వాహనాలను ప్రారంభించారు. రన్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ www. policerun. inను డీజీపీ అనురాగ్‌శర్మ, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ప్రారంభించగా ఫేస్బుక్ ఖాతా www. facebook. com/ PoliceRun2017ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ట్వీటర్ ఖాతా@ipmmr20172017ను అదనపు డీజీపీ గోపీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మెమోరియల్ రన్‌కు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రచారం కోసం మూడు వాహనాలను డీజీపీ అనురాగ్ శర్మ, మిథాలీరాజ్, కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాది పోలీసు కుటుంబమే: మిథాలీరాజ్ పోలీసు సిబ్బంది త్యాగాలు, వారి సేవలు తనకు బాగా తెలుసని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాల్‌రాజ్ పేర్కొన్నారు. తన తాత, తండ్రి పోలీసుశాఖలో పనిచేశారని, పోలీసు సిబ్బంది కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసన్నారు. కంటికి రెప్పలా పోలీసులు కల్పిస్తున్న రక్షణ వల్లే తాము దైర్యంగా క్రికెట్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నామని అభిప్రాయపడ్డారు. మహిళా రక్షణలో రాష్ట్ర పోలీసులు చేపడుతున్న చర్యలు భేష్ అని కితాబిచ్చారు. -
మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుంది
-
ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదే: మిథాలీ
హైదరాబాద్: ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ తరువాత మహిళా క్రికెట్ పట్ల ఆదరణ పెరగడం పట్ల భారత కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక మంచి పరిణామంగా ఆమె అభివర్ణించారు. మనకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందునే వరల్డ్ కప్ లో ఆకట్టుకున్నామని మిథాలీ అన్నారు. అదే సమయంలో భారత్ లో మహిళా క్రికెట్ కు ఆదరణ కూడా పెరగడం శుభసూచకమన్నారు. హైదరాబాద్ నుంచి అధిక స్థాయిలో క్రీడాకారులు తయారు కావడానికి కారణం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహమేనన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించడం ఆయా క్రీడాకారుiలు తమ అదృష్టంగా భావిస్తున్నానని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదేనన్నారు.మరొకవైపు తమకు ఇక్కడ మీడియాకు అండగా ఉండటం అభినందనీయమని మిథాలీ తెలిపారు. కాగా, భారత్ లో క్రీడాకారులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుండటం దురదృష్టకరమన్నారు.ఇక్కడ క్రీడాకారులు భారీ సక్సెస్ సాధించిన తరువాతే వారిని గుర్తిస్తారన్నారు. అదే విదేశాల్లో అయితే యుక్త వయసు నుంచి క్రీడాకారుల పట్ల శ్రద్ధ చూపెట్టి, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారన్నారు. -
మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు!
న్యూఢిల్లీ:మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. వరల్డ్ కప్‌లో పాల్గొన్న 15 మందితో కూడిన భారత మహిళా బృందానికి ప్పటికే తలో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన బీసీసీఐ..మరింత నగదు నజరానాను ఇవ్వాలని యోచిస్తోంది. కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆ మేరకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారిణుల నగదు నజరాను రూ. 60లక్షలకు పెంచాలనే చూస్తోంది. అదే సమయంలో సహాయక సిబ్బందికి రూ.30 లక్షలను ఇవ్వడానికి బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి నజరానాను పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెస్ట్‌జోన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలు ఆడే మ్యాచ్ ఫీజును కూడా పెంచే యెచనలో్ బీసీసీఐ ఉంది.